చదువుకు సహకారం
- దేవుని ఎర్రవల్లి ఎస్‌ఎంసీ చైర్మన్ సామ రంగారెడ్డి
- ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధుల సహకారంతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు
చేవెళ్ళ జూన్ 29(విజయక్రాంతి): ప్రభు త్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు సహకారం అందిస్తామని పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ సామ రంగారెడ్డి వెల ్లడించారు. చేవెళ్ళ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు(దేవుని ఎర్రవల్లి)లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వంత డబ్బులతో స్పోర ట్స్ డ్రెస్సు పంపిణీ చేశారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధుల సహకారంతో పా ఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కరికె మీనాక్షి సత్యనారాయణ, పాఠశాల అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు కరికె శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సామ మాణిక్యరెడ్డి, సామ రాజిరెడ్డి, కరికె సత్యనా రాయణ, చింపుల మల్లారెడ్డి, పత్తి సత్యనారాయణ, పాటి మల్లారెడ్డి, గోవింద్ రెడ్డి, బస్తేపురం వెంకటయ్య, గ్రామస్తులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






