కంచర్లకు ఆర్టీసీ బస్సు అదనపు ట్రిప్పు మంజూరు
భిక్కనూర్, జూలై 15(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామానికి అదనపు ఆర్టీసీ బస్సు ట్రిప్పు మంజూరు చేసినందుకు గ్రామ ప్రజాప్రతినిధులు డిపో మేనేజర్కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని వినతిపత్రం సమర్పించగా, వెంటనే సానుకూలంగా స్పందించి ట్రిప్పు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గోల్ల అరుణస్వామి మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఎన్నో రోజుల డిమాండ్ నెరవేరిందని, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలకు ఈ అదనపు బస్సు ట్రిప్పు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజల సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన ఆర్టీసీ డిపో మేనేజర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆస రమేష్, వార్డు సభ్యుడు రజనీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






