జిల్లా గ్రంథాలయాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
01-05-2026 12:12 AM
మేడ్చల్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలోని జిల్లా గ్రంథాలయాన్ని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠకులతో మాట్లాడి వారి సమస్యలు, అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పాఠకుల అభ్యర్థన మేరకు నవలలు మరింతగా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.
అలాగే పాఠకుల సౌకర్యార్థం గ్రంథాలయంలో నాలుగు కూలర్లు ఏర్పాటు చేయాలని గ్రంథాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. గ్రంథాలయ పరిసరాలను పచ్చదనంతో నింపేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. అదనంగా, పాఠకులతో వారు చదువుతున్న విధానం గురించి విచారించి, గ్రంథాలయ అభివృద్ధి కోసం ప్రతి నెల స్వయంగా సందర్శిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం. నాగవేణి గారు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.






