26 May, 2026 | 3:58 AM

రైతులపై అదనపు భారం

18-08-2025 01:29 AM
  1. అన్నదాతలను భేజారు చేస్తున్న లింకు ఎరువుల దందా

తప్పనిసరిగా కొనాలంటూ బలవంతపు షరతులు 

అవసరం లేని ఖర్చులతో పెరుగుతున్న భారాలు.. 

కంపనీలకు, హోల్‌సేల్ వ్యాపారులకు దండిగా లాభాలు

తనిఖీలు జరిగినా.. కేవలం ఫార్మాలిటీగానే ముగింపు..

ప్రభుత్వాని పెద్ద సవాలుగా మారిన లింకు ప్రొడక్టుల దందా 

మంచిర్యాల, ఆగస్టు 17 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా సహా రాష్ట్ర వ్యాప్తంగా రైతులపై కొత్త రకమైన భారం పడుతుంది. వ్యవసాయానికి అవసరమైన ప్రధాన ఎరువులు(యూరియా, డీఎపీ, కాంప్లెక్స్, పొటా ష్ ) కావాలంటే వాటితో పాటు లింకు ప్రోడ్కట్స్ తప్పనిసరిగా కొనాలంటూ బలవంతపు షరతులు విధిస్తున్నారు వ్యాపా రులు, కంపెనీ నిర్వాహకులు.

దీనితో రైతులపై భారం తప్పడం లేదు. లింకు వద్దంటే హోల్ సేల్ వ్యాపారి ఎక్కువ ధరకు ఎరువులను రిటైలర్ కి పంపిస్తుండటంతో రైతులకు మరికొంత కలిపి అమ్ముతున్నారు. ఏ లారీలోనైనా ప్రధాన ఎరువుకు 10 నుంచి 15 శాతం లింకు ఎరువులను పంపుతున్నారు.

లింకుపేరుతో బలవంతపు అమ్మకాలు.. 

హోల్ సేల్ వ్యాపారులు రిటైల్ డీలర్లకు లింకు పెడితే.., ఎరువుల దుకాణాల్లోకి వెళ్లిన రైతుకు, ఒక సంచి యూరియా కావాలంటే, ఫలానా బయో ఫర్టిలైజర్ కూడా కొనాలని, డీఎపీకి తోడు ఈ బలం ప్రొడక్టు తీసుకో వాలి అని చెప్పే పరిస్థితి ఏర్పడింది. సొసైటీలకు వస్తున్న ఎరువులు కొంతే అవుతుండటంతో రైతులు ప్రైవేటులో తీసుకోవాల్సిన దుస్థితి. దీనితో రైతు వద్దకు వచ్చిన ప్రధాన ఎరువు బిల్లు కంటే, లింకు ప్రోడకట్స్ వల్లే మొత్తం ఖర్చు రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతోందని బాధపడుతున్నారు.

రైతులకు అంటగడుతున్న చాలా ప్రొడక్టులు ఏ ఉపయోగం ఇవ్వకపోవడంతో రైతు పెట్టిన ఖర్చు వృధా అవుతోంది. దీనితో ఎరువులకే అదనపు ఖర్చు పెట్టిన రైతు విత్తనాలు, పురు గు మందుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు సరైన ఎరువులు సమయానికి అందకపోవడంతో పంట దిగుబడి తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కంపనీలకు, వ్యాపారులకు లాభాలు...

లింకు ప్రొడక్టులపై 40 నుంచి 60 శాతం వరకు లాభం వస్తుండటంతో వాటిని బలవంతంగా రైతులపై మోపుతున్నారని సమా చారం. కంపెనీ టార్గెట్లు నెరవేర్చడమే లక్ష్యం గా వ్యాపారులు రైతును వంచిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంపె నీలు ఇచ్చే అవసరం లేని లింకు ప్రొడక్టులను అమ్మడం వల్ల హోల్ సేల్ డీలర్లకు కమీష న్లు, విహారయాత్రల,

అధిక మొత్తంలో ప్రొడక్టు అమ్మితే తక్కువ ధరకు ఎరువులను ఇవ్వడమో లేదా ఒక ప్రొడక్టుకు మరో ప్రొడ క్టు ఉచితంగా ఇస్తుండటంతో వ్యాపారులు సైతం రైతులకు లింకు పెట్టి ఎరువులను విక్రయిస్తున్నారు. దీనితో అటు కంపనీలకు, ఇటు వ్యాపారులు లాభాలు గడిస్తున్నారు.

కేవలం ఫార్మాలిటీగానే తనిఖీలు..

ఎరువులు హోల్ సేల్ వ్యాపారులపై సం బంధిత శాఖ అధికారులు దృష్టి పెట్టకపోవడంతో వారు ఆడిందే ఆటలా సాగుతోంది. లింకు పెడుతున్నారని రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చినా, సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. చాలా సందర్భాల్లో తనిఖీలు జరిగినా అవి కేవలం ఫార్మాలిటీగానే ముగించేస్తున్నారు. కేసులు చేసుడే మరచిపోయారు. దీనితో లింకు ఎరువుల దందా నిరాటంకంగా కొనసాగుతోంది.

వ్యాపారుల ఇన్ వాయిస్‌లు పరిశీలించి, అవి ఎక్కడికి పంపుతున్నారు, ప్రధాన ఎరువుకు లింకు ప్రొడక్టు ఏం పెడుతున్నారు, రైతులు వాటిని కోరుకుంటున్నారా! రైతులు అడగని వాటిని బిల్ చేసి రిటైలర్‌కు పంపి ఎందుకు రైతులకు అంటగడుతున్నారో అనే కోణంలో సంబంధిత శాఖ అధికారులు ఎందుకు విచారణ జరపడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.

వ్యవసాయాన్ని లాభదాయకం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామనే మాటలకూ ఈ లింకు దందా పెద్ద సవాలుగా మారింది. అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే, రైతులపై పడుతున్న భారాలు మరింత పెరిగే ప్రమా దం ఉందని యువ వ్యవసాయ రైతులు అభిప్రాయపడుతున్నారు.ఇ ప్పటికైనా సం బంధిత శాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.