17 April, 2026 | 9:14 AM

జాగృతి పార్టీలో చేరిన మాల్తుమ్మెద, వదలపర్తి గ్రామాల కార్యకర్తలు

17-04-2026 01:43 AM

నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): మండలంలోని మాల్ తుమ్మెద,వదలపర్తి గ్రామాల వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు జాగృతి పార్టీలో చేరినట్లు మండల జాగృతి పార్టీ అధ్యక్షులు సుభాన్ రెడ్డి తెలిపారు.కామారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాలతో జాగృతి పార్టీలో చేరినట్లు మండల జాగృతి పార్టీ అధ్యక్షులు సుభాన్ రెడ్డి తెలిపారు.

అలాగే వదలపర్తి గ్రామ జాగృతి అధ్యక్షులుగా కే.అంజనేయులు,మాల్తుమ్మెద గ్రామ జాగృతి యువ అధ్యక్షులుగా సాయిబాబా, బీసీ సెల్ అధ్యక్షులుగా వెంకట్ రాములు,మాల్తుమ్మెద గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా ప్రవీణ్,నియమించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు సిద్ది రాములు,ఏజాస్,ఖలీల్, యాదగిరి,ప్రవీణ్,జాకీర్, బలరాం,విష్ణు,గడాయి సాయిలు తదితరులు పాల్గొన్నారు