అనుమతులేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
- మంచిర్యాల డీసీపీ భాస్కర్
- నకిలీ పత్తి విత్తరణపై అవగాహన
బెల్లంపల్లి,(విజయక్రాంతి): నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలుచేసినా ,విక్రయించిన రవాణా చేసినా కఠినమైన చర్యలు ఉంటాయని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. బెల్లంపల్లి శ్రేయస్ బంక్వట్ హాల్లో వ్యవసాయ,పోలీస్, రెవిన్యూ శాఖల ఆధ్వర్యంలో లైసెన్స్ కలిగిన విత్తన డీలర్స్ కు అనదికార, నకిలీ విత్తనాలా నివారణ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైనా మంచిర్యాల డీసీపీ భాస్కర్ పాల్గొని మాట్లాడారు. నకిలీ విత్తనాల విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
నకిలీ విత్తనాల దందాను నిర్మూలించేందుకు ఎప్పటికప్పుడు కార్డెన్ సెర్చ్ తనిఖీలు చేపట్టాలన్నారు. నకిలీ విత్తనాల వ్యాపారాన్ని నివారించేందుకు సమిష్టిగా పనిచేయాలన్నారు. ఈ ప్రక్రియలో డీలర్ల పాత్ర కూడా ఉండాలన్నారు. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దన్నారు. నకిలీ పత్తి విత్తనాలతో భూసారం దెబ్బతిని రైతులకు తీరం నష్టం జరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు నకిలీ విత్తనాలను ఆశ్రయించద్దన్నారు. నకిలీ విత్తనాల వ్యాపారాన్ని నిర్మించేందుకు పోలీసులకు సహకరించాలన్నారు.
బెల్లంపల్లి వ్యవసాయం అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ నాణ్యమైన విత్తన్నన్ని, నకిలీ విత్తనాన్ని ఎలా గుర్తించాలో, నకిలీ విత్తనాలు అమ్మితే ఎలాంటి చట్టపరమైన శిక్షలు పడతాయో వివరించారు. బెల్లంపల్లి అగ్రికల్చర్ ఏ డి రాజానరేందర్ మాట్లాడుతూ లైసెన్స్ పొందిన డీలర్స్ ఎవరుకూడా నకిలీ విత్తన దందాలో ప్రత్యేక్షంగా గాని, పరోక్షంగా గాని భాగస్వాములు కావద్దని, ఎవరైనా సహకరిస్తే లైసెన్స్ రద్దుచేసి క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, చెన్నూర్ ఏ డీ ఏ బానోత్ ప్రసాద్, బెల్లంపల్లి, మందమర్రి లోని ఏ డీ ఏ, ఏ వో, ఏ ఈ వో లు పాల్గొన్నారు.






