కరీంనగర్ కార్పొరేషన్‌లో కో ఆప్షన్ ఎన్నికలు
25-04-2026 04:36 PM
చక్రం తిప్పిన బండి సంజయ్
ఐదింటికి 5 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ కార్పొరేషన్ కో ఆప్షన్ ఎన్నికల్లో ఐదు స్థానాలకు గాను ఐదు స్థానాలు బిజెపి కైవసం చేసుకుంది. ఎన్నికల్లో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీజేపీ అభ్యర్థులకు జై కొట్టడంతో మొత్తం 38 మంది బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలపడంతో మైనార్టీ విభాగంలో హఫీజా బేగం, బల్వీర్ సింగ్, నందన్ కుమార్ (బిసి), చిగురు వెంకటమ్మ ( ఎస్సీ), కన్న కృష్ణ (ఓసి)లు కో ఆప్షన్ మెంబర్లుగా ఎన్నుకోబడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ కు దూరంగా ఉంది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు పాటించి సామాన్యులకు అవకాశాలు ఇవ్వడం పట్ల నాయకులు, కార్యకర్తలు కేంద్రమంత్రి బండి సంజయ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.






