25 July, 2026 | 10:13 AM

ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు

25-07-2026 09:16 AM

హైదరాబాద్: పవిత్రమైన తొలి ఏకాదశి(Tholi Ekadashi) పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం, సిరిసంపదలు వెల్లివిరియాలని, సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనాలని శ్రీమన్నారాయణుని ఆశీస్సులు అందరిపై ఉండాలని రేవంత్ రెడ్డి ప్రార్థించారు. ఈ పవిత్రమైన రోజున భక్తి, విశ్వాసంతో ఉపవాసం పాటించి, ప్రార్థనలు ఆచరించి ఆధ్యాత్మిక శాంతి, సుఖసంతోషాలను పొందాలని ఆకాంక్షించారు.