25 April, 2026 | 5:14 PM

Breaking News

కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •   మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు   •   మండలంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం   •   ఆడపిల్లలకు వరం హెచ్పీవీ వ్యాక్సిన్   •   ప్రచారం కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం   •   తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి   •   ఆధ్యాత్మికత కార్యక్రమాలతో ఐక్యత పెరుగుతుంది   •  

భూ కబ్జాకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలి

01-10-2025 02:10 AM

ప్రభుత్వానికి బాధితుడు సయ్యద్ మీర్ విజ్ఞప్తి

ఖైరతాబాద్; సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి) : తన పేరిట రిజిస్ట్రేషన్ అయిన భూమిని కాజేసేందుకు యత్నిస్తున్న వారి నుంచి తనకు, తన స్థలానికి రక్షణ కల్పించాలని బాధితుడు నయ్యద్ మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయవాది కిశోర్ కుమార్, బాలాజీ, ఎండి. అహ్మద్, మారుతీరావుతో కలిసి  మాట్లాడారు.

రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం హఫీజ్పేట్ గ్రామంలో సర్వే నం.78లో రెండెకరాల 30గుంటల స్థలాన్ని మహ్మద్ కుద్రత్ ఉన్నిసా బేగం అనే మహిళ వద్ద 1985లో కొనుగోలు చేశానని తెలిపారు. పంచాయతీ లే అవుట్ లో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశానని తెలిపారు. గతంలో కొంతమంది నా స్థలాన్ని కాజేసేందుకు చూసినా హైకోర్టు తనకు అనుకూలంగా తీర్పిచ్చిందన్నారు.

గత పదిరోజులుగా ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన వారమని చెప్తూ సదరు స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ స్థలంపై న్యాయస్థానం స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా అధికారులు స్పందించడంలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తన భూమిని తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు.