భారీ వర్షాలు....పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
30-07-2026 11:01 AM
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు
తాండూరు, జూలై 30,( విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని పెద్దముల్, యాలాల ,బషీరాబాద్, తాండూర్ ,మండలాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధానంగాతాండూర్ పట్టణ సమీపంలో ఉన్న కాగ్న నది వర్షపు నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






