4 May, 2026 | 9:18 PM

రామాలయంలో వెళ్ళివేరిసిన ఆధ్యాత్మికథ

04-05-2026 08:11 PM

- ఘనంగా ఆంజనేయ స్వామి అభిషేక పూజలు

 కోహెడ: మండల కేంద్రంలోని హరిహర  క్షేత్రం రామాలయంలో గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గవ్వ వంశీధర్ రెడ్డి దంపతులు శ్రీ హనుమాన్ మహాస్వామికి పంచామృత అభిషేకం, మన్యు సూక్త అభిషేకం, షోడష ఉపచార పూజలు, గణపతి పూజ, మంటపారధన, అవధారాలు మంత్ర పుష్పం, మంగళ హారతులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ మాల దారులకు బిక్ష వితరణ భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు.

ఈ సందర్భంగా గవ్వ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ మాల, ఆంజనేయ స్వామి మాలదారణ, హిందూ సంస్కృతిలో బాగమని ప్రేమ, శాంతి, తోటివారికి సేవచేయాలనే సంకల్పం పెరుగుతుందని ఇలాంటి కార్యక్రమాల వల్ల హిందువుల ఐక్యత పెరుగుతుంది అన్నారు. అలాగే ప్రజలందరూ ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదముతో సుభిక్షంగా ఉండాలి,

ప్రజలందరూ పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలనే సంకల్పించారు. భవిష్యత్తులో గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యా, వైద్యం ఆధ్యాత్మిక రంగాలలో విస్తృతంగా సేవలందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గవ్వ కిషన్ రెడ్డి, వదలాది హనుమాన్ మాలదారులు, పాల్గొన్నారు.