మునిపల్లిలో ఆధార్ సెంటర్ ప్రారంభం
19-05-2026 01:19 AM
మునిపల్లి మే 18 : మండల కేంద్రమైన మునిపల్లిలో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ ను తహసీల్దార్ రంగారావుతో కలిసి రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆధార్ నమోదు, మొబైల్ నంబర్ అప్డేట్, చిరునామా మార్పు, బయోమెట్రిక్ అప్డేట్ వంటి సేవలను గ్రామంలోనే సులభంగా పొందవచ్చని తెలిపారు. గ్రామ ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ సేవలను త్వరితగతిన పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజగోని సౌందర్య నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






