భజన మండలి ప్రారంభం
29-07-2026 03:50 PM
పాపన్నపేట: పాపన్నపేట మండల పరిధిలోని యూసుఫ్ పేటలో బుధవారం భజన మండలి భవనాన్ని మెదక్ జిల్లా భజన మండలి అధ్యక్షులు శ్రీ జ్ఞానానంద నగునూరి సిద్దిరామయార్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థల దాతలు బైండ్ల నారాయణ, వడ్డేపల్లి జయరాంరెడ్డితో పాటు వివిద ప్రాంతాలకు చెందిన గురువర్యులు శ్రీ నిశ్చలానంద క్రిష్ణయ్య, శ్రీ సశ్చిలా నంద నర్సింహాగౌడ్, శ్రీ సదానంద విఠల్, సమరసనంద కృష్ణయ్య, సశ్చితానంద బిక్షపతి, శ్రీ నిత్యానంద బాల నర్సయ్యతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






