ఇంటింటికి మొక్కలు నాటండి
29-07-2026 03:52 PM
బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వ పరంగా సరఫరా చేస్తున్న మొక్కలను ప్రతి ఒక్కరు నాటి పెంచాలని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని సాగర కోటకే గ్రామాలలోని పాఠశాలలో మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మొక్కలను గ్రామపంచాయతీలకు సరఫరా చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కార్యదర్శులు పాల్గొన్నారు.






