10 May, 2026 | 12:35 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

రెండు రోజులు చలిగింత

25-12-2025 02:34 AM

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో చలి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండు రోజు లు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పే ర్కొంది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం కొమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారబాద్, కామారెడ్డి, సిద్ధిపేట్, నిర్మ ల్, మెదక్, మహబూబ్‌నగర్, నిజాబాబాద్, నారాయాణపేట్ జిల్లాల్లో 9.9 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదుకాగా, జగిత్యాల్, మేడ్చల్‌మల్కాజ్‌గిరిలో 10 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రెండు రోజులపాటు ఆదిలాబాద్, కామారెడ్డి, కొము రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. బే ఆఫ్ బెంగాల్ నుంచి ప్రతీ సారి మనవైపు  హీట్ గాలులు వచ్చేవి. కానీ ఈసారి అవి బలహీనంగా వీస్తున్నాయి. దీనికతోడూ నార్త్, సెంట్రల్ నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయి.