calender_icon.png 9 February, 2026 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిముఖ పోరు!

09-02-2026 01:22:11 AM

ఇందూరులో పోటాపోటీగా తలపడుతున్న మూడు ప్రధాన పార్టీలు

  1. వ్యూహాత్మకంగా అధికార పార్టీ అడుగులు 
  2. నిజామాబాద్ మేయర్‌తో పాటు.. మిగతా మున్సిపాలిటీలను చేజిక్కించుకునేలా యత్నాలు 
  3. ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలతో బలంగా బీజేపీ 
  4. క్షేత్రస్థాయి క్యాడర్‌తో నువ్వానేనా అంటున్న బీఆర్‌ఎస్ 
  5. ఎవరు గెలిచినా.. తమకే అవకాశాలంటున్న అధికార పార్టీ 
  6. రాష్ట్రంలో ముఖ్య నేతల దృష్టి నిజామాబాద్‌పైనే..

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి) : ఇందూరు.. ఇప్పుడు యుద్ధ ప్రాంతంగా కనపడుతోంది. రాష్ట్రంలో మూడు ముఖ్యమైన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ కార్పొరే షన్‌తోపాటు.. బాన్స్‌వాడ, బిచ్కుంద, కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఆర్మూర్, భీంగల్, బోధన్ మున్సిపాలిటీల్లో పాగా వేయాలని శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నా యి.

అన్ని పార్టీలకు ఈ జిల్లాలో బలాబలాల్లో ఎవరికీ తీసిపోని విధంగా ఉండ టం, అన్ని పార్టీలకు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఈ జిల్లాతో అనుబంధం ఉండటం, క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలకు క్యాడర్ బలంగా ఉండటంతో.. త్రిముఖ పోటీ తప్పదనే సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. అయితే మరో మూడు సంవత్సరాలు అధికారంలో ఉండటం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా అనుకూలమైన అంశమనే చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో ఎవరు గెలిచినా.. జెండా ఎగరేసేది తామేననేలా కాంగ్రెస్ వ్యూహాత్మ కంగా ముందుకు సాగుతోంది. అయితే, ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. తామే జెండా ఎగరేయాలని అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్ కూడా బరిలో నిలబడి పోరాడుతున్నాయి. దీనితో అందరి దృష్టి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై కేంద్రీకృతమయ్యింది.

పట్టణ ప్రాంతాల్లో బలంగా బీజేపీ

బీజేపీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బలమైన క్యాడర్‌తోపాటు.. ప్రజల్లో ఆదరాభిమానాలు ఎక్కువగా కనపడుతున్నాయి. పైగా నిజామాబాద్ ఎంపీగా ఫైర్‌బ్రాండ్ ధర్మపురి అరవింద్‌తోపాటు, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలుగా ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్‌రెడ్డితో పాటు జెయింట్ కిల్లర్‌గా పేరుపడ్డ కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఉన్నారు. మొదటి నుంచి పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి క్యాడర్‌తో పాటు పట్టు ఉంది. అందుకు పట్టణ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు గెలుపొందడమే ఉదాహరణ.

ఇప్పుడు మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు, కాషాయ దళాలు చు రుగ్గా కదులుతూ.. ఎలాగైనా నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూర్, కామారెడ్డి లాంటి మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. యెండల లక్ష్మీనారాయణ లాం టివారితో పాటు బీజేపీలోని ముఖ్యమైన నేతలందరి దృష్టి ఈ ఉమ్మడి జిల్లాపై ఉంది.

దశాబ్దకాలంగా బీఆర్‌ఎస్ పట్టు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గడిచిన దశాబ్దకాలంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తన పట్టును  కొనసాగిస్తూనే ఉంది. బాల్కొండ, బాన్స్‌వాడల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా ప్రశాంత్‌రెడ్డి, పోచారం శ్రీని వాసరెడ్డి గెలుపొందారు. అయితే తదనంతరం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పోచారం కాంగ్రెస్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారు. అయినప్పటికీ.. జిల్లా వ్యాప్తం గా బీఆర్‌ఎస్‌కు పట్టు ఉంది. బాన్స్‌వాడ నియోజకవర్గంలోని ప్రజలు అప్పట్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేశారని.. ఇప్పుడు అదే తిరిగి పునరావృతం అవుతుందనే ధీమాతో ఆ పా ర్టీ శ్రేణులున్నాయి.

అంతకు ముందు ఎంపీ గా బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఉన్నారు. తరువాత ఓడిపోయినా.. పార్టీకి క్యాడర్ ఉందని అంటున్నారు. అయితే, తాజాగా కవి త పార్టీని వీడిన నేపథ్యంలో క్యాడర్ ఎంతవరకు ముందుకు వస్తుందనేది చూడాలి. బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్ తదితర నేతలు బీఆర్‌ఎస్ శ్రేణులను ముందుకు నడిపిస్తున్నారు. కార్పొరేషన్‌తోపాటు మిగిలిన మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు.

మెజారిటీ ఎటువైపు..?

నిజామాబాద్ కార్పొరేషన్, 7 మున్సిపాలిటీల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య ను వ్వానేనా అనే పరిస్థితి నెలకొంది. పోటీలో నిలబడ్డ ప్రతి అభ్యర్థి కూడా తమ గెలుపోటములను బేరీజు వేసుకునే ముందుకు వచ్చా రు. కచ్చితంగా ఫలానా పార్టీ అభ్యర్థికే గెలిచే అవకాశాలున్నాయే సంకేతాలు స్పష్టంగా వ చ్చిన చోట మాత్రం మిగతా పార్టీలు కొంత బలహీనమైన అభ్యర్థులతో మమ అనిపించాయని.. అలాంటి చోట్ల ఖర్చు పెట్టవద్దనే కోణంలోనూ సూచనలు వెళ్లాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో త్రిముఖపోటీ నెలకొ న్న కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో.. ఎవరికి మెజారిటీ వస్తుందనే దానిపై అస్పష్టత ఉం ది. ఒకవేళ ఎవరికీ మెజారిటీ రాకుం డా.. ఉంటే.. ఎవరికి అవకాశం ఉంటుందనే దాని పై ఇప్పుడే చర్చ మొదలయ్యింది. ఏ పార్టీలో గెలిచినా.. తాము అందించే స్నేహ ‘హస్తం’ కోసం చాలా మంది ఉవ్విళ్లురుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. అందు కు తగిన వ్యూహంతోనే ముందుకు సాగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నా రు.

పైగా ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో ఎవరికీ మెజారిటీ రాకపోయినా.. గెలుపొందిన అభ్యర్థులు తాము ఖర్చుపెట్టిన మొత్తాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తారనే చర్చ కూడా జనంలో ఉంది. ఇలాంటి పరిస్థితులే తమకు అనుకూలంగా మలుచుకుని హస్తగతం చేసుకోవాలనే ఆలోచన ప్ర కారం.. అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధం గా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యనేతలకు ముచ్చెమటలు !

ఉమ్మడి నిజామాబాద్ కార్పొరేషన్‌తోపా టు.. 7 మున్సిపాలిటీలు అన్ని పార్టీల్లో నూ ముఖ్యమైన నేతలకు చావో.. రేవో అన్న చందంగా పరిణమించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీలో ఎంపీ అర వింద్, ఎమ్మెల్యేలు సూర్యనారాయణ, రాకేష్‌రెడ్డి, వెంకటరమణారెడ్డిలు తాము ప్రాతి నిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీలతో పాటు నిజామాబాద్ కార్పొరేషన్‌ను నిలబెట్టుకోవడం తప్పనిసరి. లేకపోతే రెం డేండ్లలోనే పట్టుకోల్పోయిట్లు అవుతుంది.

కాంగ్రెస్ వరకు వస్తే.. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు సొంతూరు కావడం, అలాగే సీనియర్ నేత షబ్బీర్ అలీ ఇదే జిల్లాకు చెం దిన నేత కావడంతో నిజామాబాద్ కార్పొరేషన్,  బాన్స్‌వాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బో ధన్, బిచ్కుందల్లో గెలుపొందడం తప్పనిసరిగా పరిణమించింది. అలాగే భీంగల్, బోధ న్, ఆర్మూర్‌తోపాటు నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీఆర్‌ఎస్ తమ పట్టు ను నిలబెట్టు కోవాలి.

అంటే పార్టీ ఏదైనా.. తమ పరిధిలోని మున్సిపాలిటీలతో పాటు.. నిజామా బాద్ కార్పొరేషన్‌పై తమ జెండా ఎగరేయాలనే తపనతో ఉన్నాయి. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పోరు హోరాహోరీగా సాగుతోంది. మరో వారం రోజుల్లో ఎవరికీ మెజారిటీ రాకపోతే.. ఏం చేయాలనే వ్యూహాలతో అన్ని పార్టీలు అడుగులు వేస్తున్నాయి.

మూడేండ్లు అధికారంలోనే.. కాంగ్రెస్ ధీమా 

ఇక అధికార పార్టీ కాంగ్రెస్‌కు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఎల్లారెడ్డి నుంచి మదన్‌మోహన్‌రావు, జుక్కల్ నుంచి తోట లక్ష్మీకాంత రావు, నిజామాబాద్ రూరల్ నుంచి భూపతిరెడ్డి, బోధన్ నుంచి సుదర్శన్‌రెడ్డి ఉండటంతోపాటు.. బాన్స్‌వాడలో బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందినా.. ఈ మధ్య కాంగ్రెస్‌తో కాస్త సన్నిహితంగా మెలుగుతున్న పోచారం శ్రీనివాసరెడ్డి ఉండటం కలిసొచ్చేదే.

నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు మరో ఏడు మున్సిపాలిటీల్లో గెలుపొందడమే ధ్యేయం గా కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. పైగా భారీగా ఉన్న ముస్లిం ఓట్లతో పాటు ఎంఐఎం నుంచి తమకు  వ్యూహాత్మకంగా అందుతున్న మద్దతుతో క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అన్నింటికి మించి.. మరో మూడేం డ్లు అధికారంలో ఉండటం కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చేదే. అభివృద్ధి పనులు, నిధుల కోసం కచ్చితంగా ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుం దని.. ఇక్కడే తమకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది.