26 May, 2026 | 2:39 AM

ఫ్రెంచ్ ఓపెన్‌లో తెలుగోడి సంచలనం

26-05-2026 12:00 AM

పారిస్, మే 25 : ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లా మ్ టోర్నీలో సంచలనం నమోదయ్యింది. తెలుగు సంతతి కుర్రాడు నిశేష్ బసవరెడ్డి స్టార్ ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌కు షాకిచ్చాడు. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థా నంలో ఉన్న ఫ్రిట్జ్‌ను తొలిరౌండ్‌లో నిశేష్ ఓ డించాడు. అమెరికా తరపున ఆడుతున్న నిశే ష్ బసవరెడ్డి 7-6, 7--6, 6--7, 6--1తో తన దేశానికే చెందిన టేలర్ ఫ్రిట్జ్‌ను మట్టికరిపించాడు. నిశేష్ రెడ్డి కాలిఫోర్నియాలో జన్మించాడు. 

అతడి తల్లిదండ్రులు సాయి ప్రసన్న, మురళీకృష్ణల స్వ స్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు. 1999లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నిశేష్ చిన్న వయసు నుంచే టెన్నిస్‌లో విశేషంగా రాణించాడు. కోచ్ బ్రయాన్ స్మిత్ దగ్గర శిక్షణ పొం దాడు. అలాగే రెండు ఏటీపీ ఛాలెంజర్ టైటి ళ్లు గెలిచాడు. 2025లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా గ్రాండ్ స్లామ్ అరంగేట్రం చేసిన నిషేశ్ దిగ్గజ ఆటగాడు జకోవిచ్‌పై తొలి సెట్ గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.