21 August, 2026 | 1:49 AM

విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట

21-08-2026 01:10 AM
  1. గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ 
  2. విద్యార్థులకు యూనిఫామ్‌లు బ్యాగులు పంపిణీ

గణపురం, ఆగస్టు 20 (విజయ క్రాంతి): విద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. గురువారం మోడల్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు యూనిఫాంలు, పాఠశాల బ్యాగులను, ఇంటర్, 10 తరగతుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యా సామగ్రి అందిస్తూ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా రాణించాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో  అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గుర్రం వసంత, మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.