12 May, 2026 | 10:56 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

రోడ్డుపైనే దుకాణం!

10-11-2025 12:00 AM

- దుంపలకుంటలో అక్రమార్కుల ఇష్టారాజ్యం

- మీటర్ల కు ఎన్వోసీ ఇస్తున్న విద్యుత్ అధికారులు

- ఫిర్యాదు చేసినా పట్టించుకోని పంచాయతీకార్యదర్శి

కొల్చారం, నవంబర్ 9 :నిబంధనలకు వి రుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుపైనే రేకులతో దుకాణాలను ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. కొల్చారం మండలం దుంపలకుంట వారాంతపు సంతలో దుంపలకుంట నుండి కౌడి పల్లి వెళ్లే మార్గంలో రోడ్డుపై నూతనంగా ఏ ర్పాటు చేసిన రేకుల షెడ్డులతో సంతకు వచ్చే వినియోగదారులు, ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మండలంలోని ఎనగండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బుల కుంట చౌరస్తాలో దుంపలకుంట నుండి కౌడిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై దుంపలకుంట నుండి ఎనగండ్ల వెళ్లేదారిలో, మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై మూ డు మార్గాలలో అనుమతులు లేకుండా రో డ్లపైనే రేకులతో దుకాణాలను ఏర్పాటు చేశా రు. దీంతో మూడు మార్గాలలో రోడ్లు కూ చించుకు పోయాయి. ప్రతి మంగళవారం జరిగే సంతకు కొల్చారం, కౌడిపల్లి, చిలిపిచె డ్, అందోల్ తదితర మండలాల నుండి వం దల సంఖ్యలో ప్రజలు వస్తారు.

దుంపకుం ట నుండి కౌడిపల్లి వెళ్లే ప్రయాణికులు సం తను దాటి వెళ్లాలంటేసుమారు అరగంట సమయం పడుతుంది. దీంతో సంతకు వచ్చే వ్యాపారులు, ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పంచాయతీ కార్యదర్శికి తైబజార్ వసూలు పై ఉన్న శ్రద్ధ మార్కెట్లో వసతులు కల్పించడంపై లేదని వ్యాపారస్థులు, ప్రజలు ఆరోపి స్తున్నారు. అంతేగాకుండా ఆ దుకాణాలకు విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు సైతం ఇస్తున్నట్లు గ్రామస్తులు ఆరో పించారు.

ఎనగండ్ల గ్రామపంచాయతీ పరిధిలో దుంపలకుంట చౌరస్తాలో ప్రభుత్వ అ సైన్డ్ భూముల్లో ఎలాంటి నాలా కన్వర్షన్ లేకుండా ఇండ్లు, వ్యాపార సంస్థల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతో పాటు రో డ్డుపై సైతం దుకాణాలు ఏర్పాటు చేసుకునే లా పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకుని రోడ్డుపై ఆక్రమణలను తొలగించాలని ఎనగండ్ల పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి సౌజన్య, మండల పంచాయతీ అధికారి కృష్ణవేణి లను వివరణ కోరడానికి ప్రయత్నించగా ఫోన్లో అందుబాటులోకి రాలేదు.