19 March, 2026 | 6:50 PM

రాష్ట్రంలో గూండారాజ్యం నడుస్తుంది

19-03-2026 01:44 AM
  1. పోలీసుల కనుసన్నల్లో దాడులు 
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

నల్లగొండటౌన్, మార్చి 18: రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. నల్లగొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ నా యకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తలను బుధవారం నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పరామర్శించారు.

అనంతరం మీడియాతో మా ట్లాడారు. చండూర్‌లో పోటీ చేస్తున్న బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నాయకులు వారి గుండాలతో దాడులు చేయించారని ఆరోపించారు. సరైన వైద్యం అందకుండా కాంగ్రెస్ నాయకులు వైద్యులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డిపై నల్లగొండ డీఎస్పీ దాడి, చండూరులో కాంగ్రెస్ దాడిపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

కాంగ్రెస్ పాలనలో డ్రగ్స్ దందా, భూదందా, లిక్కర్ దందా నడుస్తుందని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై, నాయకులపై దాడులు జరిగితే నామమాత్రపు కేసు లు పెడుతున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్నర్ మీటింగ్ నిర్వహించి నాయకులకు నిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, సీనియర్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, వీరేల్లి చంద్రశేఖర్, సాంబయ్య, పిళ్లి రామరాజు యాదవ్, నరసింహ, అనిల్, రవికుమార్ గౌడ్ పాల్గొన్నారు.