3 July, 2026 | 10:43 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

జర్నలిస్టులకు ఇండ్ల ప్లాట్లను ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

19-12-2025 12:13 AM

చిట్యాల, డిసెంబర్ 18 :  చిట్యాల మండలంలోని జర్నలిస్టులందరికీ ఇండ్ల పట్టాలను అందించాలని కోరుతూ టియుడబ్ల్యూజే (ఐజెయు) ఆధ్వర్యంలో గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిజాన్ని నమ్ముకొని నిస్వార్ధంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పాలకులు మాత్రం హామీలు ఇస్తున్నారు తప్పా వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బయన్న అన్నారు.

ఈ ప్రభుత్వ హయాంలోనైనా తమకు ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేసి తమ సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందిస్తూ ఇళ్లపట్టాలను పంపిణీ చేసేందుకు త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు)  యూనియన్ మండల అధ్యక్షుడు మెండే వెంకన్న, ప్రధాన కార్యదర్శి పోకల కరుణాకర్, కోశాధికారి చెరుపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వెంకన్న పాల్గొన్నారు.