3 July, 2026 | 11:38 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

చెర్వుఅన్నారం ఉపసర్పంచ్‌గా పొన్న శిరీష సురేష్, వార్డు మెంబర్లుగా దెందె సురేష్ ఎన్నిక

19-12-2025 12:16 AM

నకిరేకల్, డిసెంబర్ 18 : కట్టంగూరు మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో ఈ నెల 11న నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మిత్రపక్షాల మద్దతుతో   సీపీఎం అభ్యర్థులుగా  పోటీ చేసి ఘన విజయం సాధించారు. తొమ్మిదో వార్డు మెంబర్గా పొన్న శిరీష సురేష్, మూడో వార్డు మెంబర్గా దెందె సురేష్ ఎన్నికయ్యారు. పొత్తులో భాగంగా  పొన్న శిరీష సురేష్ ఉపసర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో ఎన్నికల్లో పోటీ చేశామని వారు తెలిపారు.

అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ గ్రామ సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని  వారు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని, ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రతి సంక్షేమ పథకం అర్హులకు చేరేలా కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ నెల 22న పొన్న శిరీష సురేష్ ఉపసర్పంచ్గా, దెందె సురేష్ మూడో వార్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

గతంలో విద్యార్థి ఉద్యమాలు, ప్రజాతంత్ర ఉద్యమాల్లో పని చేసిన అనుభవం తమకు ఉందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు.