3 July, 2026 | 9:41 PM

Breaking News

ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •  

భద్రాచలం బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత వాతావరణం

19-12-2025 12:12 AM

భద్రాచలం, డిసెంబర్ 18 (విజయక్రాంతి): భద్రాచలం గోదావరి వంతెన  వద్ద గురువారం ఉదయం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గురువారం సజ్జ రవివర్మపై భౌతిక దాడికి పాల్పడి హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువులు భద్రాచలం - సారపాక వెళ్లే వంతెన ముందు బైఠాయించారు. మాకు న్యాయం చేయండి మహాప్రభో... గంజాయి మూకల ఆగడాలు అరికట్టాలి... హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి... అంటూ నినాదాలు చేశారు.

పరిస్థితిని కుదుటపరిచ్చేందుకు  పోలీసులు ప్రయత్నించారు. కాగా భద్రాచలం ఎమ్మెల్యే డా.వెంకట్రావు సంఘటన జరిగే  నిరసన ప్రదేశానికి చేరుకొని  బాధిత రవి వర్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడేందుకు ప్రయత్నిస్తానని, కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున తగు న్యాయం  చేస్తానని హామీ ఇవ్వడంతో రవివర్మ కుటుంబ సభ్యులు నిరసనను విరమించారు.

అయితే గురువారం జరిగిన దాడిలో గాయపడిన వారు నిందితులకు శిక్ష వేయించాలన్న డిమాండ్ తో ఒంటి మీద పెట్రోల్ పోసుకోవడం కొంత ఆందోళనానికి గురి చేసింది. కాగా పరిస్థితిని పోలీసులు అదుపు చేశారు. దీంతో భద్రాచలం వైపు, సారపాక వైపు బ్రిడ్జిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వివిధ ప్రదేశాల నుండి వచ్చిన ప్రయాణికులు వారి వాహనాలను వదిలి నడక ద్వారా భద్రాచలం చేరుకునే పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో మృతుని బంధువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.