04-02-2026 01:26:37 AM
ఘట్ కేసర్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని కొండాపూర్ లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని కోరుతూ కొండాపూర్, పరిసర ప్రాంత ప్రజలు మంగళవారం డిప్యూటీ కమీషనర్ వాణి కి వినతి పత్రం అందజేశారు. ఘట్ కేసర్ పరిధి కొండాపూర్ పరిసర ప్రాంతములో ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.
ఈడంపింగ్ యార్డ్ సుమారు10 సంవత్సరాల క్రితం కొండాపురం గ్రామ పంచాయితీగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయబడింది. అప్పట్లో జనాభా తక్కువగా ఉండటం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కాలక్రమేగా ఇది మున్సిపాలిటీగా, ఇప్పుడు జిహెచ్‌ఎంసి పరిధిలోకి వచ్చింది. గతంలో రోజుకు 1 లేదా 2 వాహనాలు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 30 నుండి 40 వహవాలకు పెరిగింది. ఇక్కడ కేవలం సాధారణ వ్యర్ధాలే కాకుండా ప్రమానకరమైన వైద్య, రసాయనిక వ్యర్థాలను కూడ పారబోస్తున్నారు. ప్రతి రోజు ఈ వ్యర్థ్యాలను తగుల బెట్టడం (కాల్చడం) వల్ల వెలువడే విషపూరిత పొగ గాలిని అపరిశుభ్రం చేస్తోంది.
దీని వల్ల భూగర్భ జలాలు కూడా కలుషిత మవుత్నూయి. దీనివల్ల కొండాపూర్, ఘట్ కేసర్ ఈడబ్ల్యూఎస్ కాలనీ, సింగరేణి కాలనీ, ఎం ఎఫ్ సి నగర్, ఘట్ కేసర్ ప్రాంతాల ప్రజలు తీవ్రమైన శ్వాసకోస ఇతర ఆరోగ్య సమస్యలతో ఇచ్చింది పడుతున్నారు. కావున ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఉంపింగ్ యార్డ్ ను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించుటకు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ కు అందజేసిన వినతిపత్రంలో కోరారు.