calender_icon.png 10 February, 2026 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు అరెస్టు

10-02-2026 12:00:00 AM

  1. 80 గ్రాముల బంగారం

300 గ్రాముల వెండి స్వాధీనం

ఎల్బీనగర్, ఫిబ్రవరి 9 : ఇంటి తాళాలు పగలగొట్టి రాత్రివేళల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు మండే విజయ్కుమార్ను సోమవారం నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరేళ్లి గ్రామ పరిధిలోని శ్రీ రుద్ర బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ నంద కిశోర్ ఇంట్లో జనవరిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేధించా రు. ఈ ఘటనలో బాధితుడు డాక్టర్ నంద కిశోర్ ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళం పగలగొట్టి బంగారు, వెండి ఆభరణా లు, విలువైన వస్తువులు చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

నిందితుడి వద్ద నుంచి చోరీకి సంబంధించిన సొత్తును రికవర్ చేసినట్లు నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మ ద్ మక్బూల్ జానీ తెలిపారు. ఈ కేసులో నిందితుడు విజయ్కుమార్ చర్లపల్లి జైలులో పరిచయం అయిన మరో పాత నేరస్తుడు డెరింగుల హరిబాబుతో కలిసి మేడ్చల్, పఠాన్చేరు, కీసర, మేడిపల్లి, నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రివేళల్లో ఇంటి తాళాలు పగలగొట్టి వరుస దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు.

నిందితుడి నుంచి 8 తులాల బంగారం, మూడు గ్రా ముల వెండి, 8 చేతి గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరిం చారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, సోమవారం రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.