12-02-2026 12:41:01 AM
ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండె వాల్వ్ చికిత్స
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే 72 ఏళ్ల వృద్ధురాలికి విజయవంతంగా చికిత్స అందించినట్లు సికింద్రాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. కొన్ని నెలలుగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బం ది, చిన్న పని చేసినా ఆయాసం, తీవ్ర అలసట వంటి సమస్యలు ఉండేవి. మొదట వీటి ని వయస్సు ప్రభావంగా భావించి నిర్లక్ష్యం చేశారు. అయితే పరిస్థితి విషమించి గుండె వైఫల్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. పరీక్షల్లో ఆమె మిట్రల్ వాల్వ్లో తీవ్రమైన లీకే జ్ ఉన్నట్లు గుర్తించారు.
ఆమె వయస్సు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఓపె న్ హార్ట్ సర్జరీ ప్రమాదకరమని భావించారు. దీంతో మల్టీడిసిప్లినరీ హార్ట్ టీమ్ కేసును సమగ్రంగా పరిశీలించింది. డా. ప్రమోద్ కుమార్ కుచులకంటి, డైరెక్టర్ స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్, అడ్వానస్డ్ కోరనరీ ఇంటర్వెన్షన్స్ నాయకత్వంలో, డా. సాగర్ చంద్రశే ఖర్ భుయార్, డా. ఎన్. శివ ప్రసాద్ నా యుడు,
డా. అమరేంద్ర కుమార్ సింగ్, డా. పర్వత్రాజ్ వరుణ్ గౌతమ్, డా. సుబ్రహ్మ ణ్యం సమన్వయంతో కాథెటర్ ద్వారా మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలో చికిత్స నిర్వహించారు. కాలి రక్తనాళం ద్వారా చిన్న ట్యూబ్ పంపిం చి, ఆధునిక ఇమేజింగ్ సాయంతో వాల్వ్ లీకేజీని తగ్గించారు. సకాలంలో పరీక్షలు చేయించుకుంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే ఆధునిక పద్ధతుల్లో సురక్షితంగా చికిత్స చేయవచ్చు అని వారు చెప్పారు. ప్రస్తుతం రోగి పరిస్థ్థితి మెరుగ్గా ఉందనిరోజువారీ పనులు స్వయంగా చేసుకుంటున్నారు.