9 May, 2026 | 10:23 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

రాష్ట్రస్థాయి సీనియర్ కబడ్డీ పోటీలకు గుడివెనకతండా క్రీడాకారిణి

26-12-2025 12:00 AM

గాంధారి, డిసెంబర్ 25 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర స్తాయి సీనియర్ కబడ్డీ పోటీలకు మండలంలోని గుడివెనక తండ కు చెందిన సుచరిత ఎంపిక అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. ఈ నెల 22 న కామారెడ్డి ఇందిరా గాంధీ క్రీడమైదనంలో జరిగిన ఎంపిక పోటీల్లో అద్భుతంగా రాణించిన ఆమెను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు,ఈ నెల 25 నుండి 28 వరకు కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో జరుగుతున్నా పోటీల్లో కామారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుందని ఆయన తెలిపారు,

సుచరిత ప్రస్తుతం మేడ్చల్ జిల్లా చేగుంట క్రీడా పాఠశాలలో  ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమెకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బ్రహ్మరాజ్, రంగ వేంకటేశ్వర గౌడ్, ఎస్జీఫ్ కార్యదర్శి  హీరాలాల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ భాస్కర్ రెడ్డి, గుడివెనక తండ సర్పంచ్ రవి నాయక్, ఉప సర్పంచ్ సంతోష్ అభినందించారు.