7 April, 2026 | 2:22 AM

మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వమే చిరునామా

07-04-2026 12:20 AM

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

చిన్న చింతకుంట ఏప్రిల్ 6 : మహిళలు కేవలం వంటగదికే పరిమితం కాకుండా ఆర్థికంగా ఎదిగి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు.

మండల కేంద్ర పరిధిలోని లాల్ కోట గ్రామంలో సోమవారం చిలుకటి సునీత నర్సింహులు ఏర్పాటు చేసిన విజయ డెయిరీ తెలంగాణ పార్లర్ ను, తెలంగాణ రాష్ట్ర డైరీ అభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఈ ఏడాది రూ. 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని, రాబోయే కాలంలో దీనిని రూ. లక్ష కోట్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా, మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి వారిని బస్సులకు యజమానులుగా మారుస్తున్నామన్నారు. స్కూల్ యూనిఫాంల తయారీ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, పౌల్ట్రీ వంటి రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. మూసాపేట్ మండల కేంద్రంలో మూతపడిన పాల శీతలీకరణ కేంద్రాన్ని పునఃప్రారంభించాలని ఎమ్మెల్యే కోరగా ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్ర అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.