5 July, 2026 | 2:13 AM

యాకూబ్ మృతిలో కొత్త ట్విస్ట్..

05-07-2026 12:35 AM

కోదాడ జూలై 4 (విజయక్రాంతి) : సూర్యాపేట జిల్లా కోదాడలో ఇటీవల మరణించిన యాకూబ్ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 30న కోదాడ ఖమ్మం క్రాస్ రోడ్డులో ముగ్గురు మిత్రులు ఓ బార్‌దీతిజిజిలో మద్యం తాగేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రమేష్, మహేష్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

వారిని ఆపేందుకు యాకూబ్ ప్రయత్నించగా, రమేష్‌కు మద్దతుగా మాట్లాడుతున్నాడని భావించిన మహేష్ అతడిని దూషించాడు. అనంతరం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యాకూబ్‌ను కాలితో తన్నడంతో అతడు అదుపు తప్పి లారీ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు ఘటన వెలుగులోకి వచ్చింది.