5 August, 2026 | 4:19 AM

సీతాకోకలా.. సరిహద్దులే దాటెయ్ అలా..

05-08-2026 12:00 AM

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, మహిళల భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలను పోషించారు. బాలాజీ గుత్తా, కౌశిక్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ‘సీతాకోకలా’ అనే సాంగ్‌ను విడుదలైంది. ‘ఇపుడే ఇపుడే తడిమింది చల్లగాలి.. ఎదలో బరువే తొలగింది హాయి వాలి.. తరిమే తరిమే భయమంత వదిలి.. అడుగే పెడితే దరిచేరుకోద జాబిలి.. సీతాకోకలా నువ్విలా.. సరిహద్దులే దాటెయ్ అలా.. నువ్వు సాగిపో అలా..’ అంటూ సాగుతోందీ గీతం. శేఖర్ చంద్ర స్వరాలు సమకూర్చిన ఈ పాటను సురేశ్ బానిసెట్టి రాయగా, చిన్మయి పాడింది.