బెంగాల్‌లో నవోదయం
- ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే
- అధికార తృణమూల్ అస్తమయం
- ఎన్నికల ప్రచారం పూర్తయింది
- బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తా..
- చివరి రోజు ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
కోల్‌కతా, ఏప్రిల్ 27: ‘ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో బెంగాల్‌కు నవోదయం వస్తుంది. అధికార తృణమూల్ అస్తమయం అవుతుం ది. ఎన్నికల ప్రచారం పూర్తయింది. బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి మళ్లీ వస్తా..’ అని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఇదే నా చివరి ప్రచార ర్యాలీ అన్నారు. మే 4న ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి కచ్చితంగా వస్తాననే నమ్మకంతో తిరిగి వెళ్తున్నానని మోదీ పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారానికి సోమవారం 5 గంటలకు తెరపడింది. ర్యాలీలు, రోడ్‌షోలతో రాష్ట్ర వ్యాప్తం గా విస్తృత ప్రచారం సాగించిన ప్రధాని మో దీ.. బరాక్ పూర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో పాల్గొని అనంతరం బహిరంగ సభలో మా ట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. బెంగా ల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందనే సంకేతాలు ఇస్తూ, బీజేపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మళ్లీ వస్తానని ప్రధా ని తెలిపారు.
‘ఈ ఎన్నికలకు సంబంధించి ఇదే నా చివరి ప్రచార ర్యాలీ. మే 4న ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ముఖ్య మంత్రి ప్రమాణస్వీకారానికి కచ్చితంగా వస్తాననే నమ్మకంతో తిరిగి వెళ్తున్నారు. హెలిపాడ్ నుంచి నేను రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడకు వచ్చాను. దారికి రెండు వైపులా వేలాది మంది ప్రజలు బారు లు తీరారు. ఇంత పొద్దున్నే జనం పెద్ద సం ఖ్యలో నన్ను ఆశీర్వదించడానికి వస్తారని ఊహించలేదు’ అని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.
అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. టీఎంసీ పాలనలో రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గిపోయాయని, ఫ్యాక్టరీలు మూత పడ్డాయని, పశ్చిమబెంగాల్ భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన రోడ్‌మ్యాప్ టీఎంసీ ప్రభుత్వం వద్ద లేదని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరం ఇక్కడ ఎంతైనా ఉందని, కేంద్ర-, రాష్ట్రాల సమన్వయంతోనే వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
టీఎంసీ సిండికేట్ వ్యవస్థ భూస్థాపితం కావాలన్నారు, నిర్మాణాత్మక పాలనకు బదులు బెదిరింపులు, మోసపూరిత రాజకీయాలపైనే టీఎంసీ ఆధారపడిందని విమ ర్శించారు. రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని, ప్రజావిశ్వాసాన్ని టీఎంసీ కోల్పోయిందని, అది గుర్తుంచుకుని మ హిళా ఓటర్లు ఓటు వేయాలని కోరారు.
లండన్ తరహాలో కోల్‌కతాను అభివృద్ధి చేస్తామని టీఎంసీ గతంలో ఇచ్చిన హామీలను మోదీ ప్రస్తావిస్తూ, గత 15 ఏళ్లుగా కోల్‌కతా తన గుర్తింపును కోల్పోయిందని, అక్రమ చొరబాటుదారులు సిటీలో సెటిల్ అయ్యారని అన్నారు. నగర పూర్వ వైభవాన్ని పరిరక్షించేందుకు కోల్‌కతా వాసులంతా సమష్టిగా కృషి చేయాలని కోరారు. మెరుగైన శాంతి భద్రతల కోసం ఓటర్లు ‘కమలం’ గుర్తును ఎంచుకోవాలని కోరారు.
సకాలంలో ప్రభుత్వ నియామకాలు జరుపుతా మని, ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని, ఉద్యోగులకు 7వ వేతన కమిషన్ ప్రయోజనాలు కల్పిస్తామని, జీరామ్జీ గ్రామీణ ఉపాధి పథకం అమలు చేస్తామని చెప్పారు. ‘పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఈ ఎన్ని కలు బెంగాల్‌తో పాటు తూర్పు భారతదేశం భవిష్యత్‌ను మార్చివేస్తాయి. గతంలో భారతదేశం సుసంపన్నంగా వెలుగొందినప్పుడు.. దానికి మూడు బలమైన మూలస్తంభాలు ఉండేవి.
అంగ, వంగ, కళింగ. అంటే బీహార్, బెంగాల్, ఒడిశా. నేడు భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఆ లక్ష్య సాధన కోసం అంగ, వంగ, కళింగ ప్రాంతా లు బలంగా ఉండటం అత్యవసరం.. అని అన్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ఈనెల 23న జరుగగా, 29న తుది విడత పోలింగ్ జరుగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.






