28 April, 2026 | 1:18 PM

Breaking News

పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు   •   మహబూబాబాద్‌లో దారుణం.. కుమారులను చంపి తండ్రి ఆత్మహత్య   •   గూగుల్‌ రాక ఏపీకి గేమ్‌ ఛేంజర్‌   •   విశాఖపట్నం ఇక నుంచి AI పట్నం.. దక్షిణాదిపై అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు   •   ప్రజల ఆశీస్సులతో మళ్ళీ పునః జన్మ దక్కింది   •   క్రేన్‌ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి వివేక్‌   •   పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై నిరసన.. ఆటోను తాడుతో లాగిన సీఐటీయూ నాయకులు   •   పెట్రోల్, డీజిల్ సరఫరాపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన   •   ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ.. యువకులతో పోటీపడి గోల్స్..!   •   పెట్రోల్, డీజిల్ ఉన్న.. బంకుల ముందు క్యూలైన్లు   •  

ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ.. యువకులతో పోటీపడి గోల్స్..!

28-04-2026 10:59 AM

గాంగ్‌టక్: సిక్కిం రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సరదాగా ఫుట్‌బాల్(PM Modi plays football) ఆడారు. రాజధాని గాంగ్‌టక్ స్థానిక యువతీ యువకులు ఫుట్‌బాల్ ఆడుతుండగా అక్కడకు వెళ్లిన మోదీ వారితో కాసేపు ముచ్చటించారు. తాను కూడా ఫుట్‌బాల్ ఆడుతానని వారితో చెప్పారు. కాసేపట్లోనే స్పోర్ట్స్ జెర్సీ ధరించి వచ్చిన ప్రధాని మోదీ సిక్కిం ఆటగాళ్లతో సరదాగా ఫుట్‌బాల్ ఆడి, గోల్స్ కోట్టారు.

ఈ సాకర్ సెషన్‌ను ప్రధాని ఉత్సాహభరితంగా అభివర్ణించారు. మోదీ, తాను యువకులతో సాకర్ ఆడుతున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రధాని ఫుట్‌బాల్ ఆడిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "గాంగ్‌టక్‌లోని ఒక అందమైన ఉదయం వేళ సిక్కింలోని నా యువ మిత్రులతో ఫుట్‌బాల్ ఆడటం కంటే గొప్పది ఏదీ లేదు! స్పష్టంగా, ఈ యువకులతో ఇది ఒక ఉత్తేజకరమైన ఫుట్‌బాల్ సెషన్!" అని ప్రధాని ఎక్స్ లో పేర్కొన్నారు.