అమెరికన్ నటితో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్!
ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మ, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం పాన్ ఇండియాగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనోక్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనుంది.
థియేటర్లలో విడుదలకు ముందే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ప్రముఖ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించగా సినీ వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ఇక హీరోయిన్ జో శర్మా అమెరికా, భారత్‌లో విస్తతంగా నిర్వహించిన ప్రమోషన్ టూర్ చిత్రానికి మరింత ప్రచారం తీసుకువచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఉత్కంఠభరిత అనుభూతికి గురిచేసే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు పొందుతుందని చిత్రబందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.




