12 May, 2026 | 3:37 AM

గ్రంథాలయం విజ్ఞాన దేవాలయం

12-05-2026 12:15 AM
  1. సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం అభినందనీయం
  2. మార్కెట్ కమిటీ చైర్మన్ అల్వాల జ్యోతి

జడ్చర్ల, మే 11 : ఎంతోమంది కి ఉన్నత జీవితాలను అందించేందుకు దోహదపడుతున్న గ్రంధాలయం ను సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం అభినందనీయమని మార్కెట్ కమిటీ చైర్మన్ అల్వాల జ్యోతి అన్నారు. సోమవారం బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం విద్యా వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయ అధికారి ఆంజనేయులు తన సొంత ఖర్చులతో గ్రంథాలయాన్ని ఆధునీకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. చదువుపై ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలని చదివే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకువస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుకన్య వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నర్మదా, అధ్యాపకులు రుక్యభాను, రాఘవేంద్ర రెడ్డి, సులేమాన్, ఆంజనేయులు, నర్సింలు, నరసింహరావు, పుష్పలత, వెంకటయ్య, ప్రవీణ్, సతీష్ రెడ్డి, విక్రమ్, వెంకటేశ్వర్లు, సూరయ్య, రాజేశ్వరి, ఇష్రత్ తదితరులు పాల్గొన్నారు.