బావిలో పడి రైతు మృతి
సదాశివ నగర్, మే 11 (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ రైతు మృతి చెందిన ఘటన సోమవారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సోషల్ గ్రామానికి చెందిన కురుమ జోగిని లింగం (50) అనే రైతు ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు.
పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు తిరిగి ఇంటికి రాలేదు. బావి పక్కనే వెళుతూ ఉండగా ప్రమాదవశాత్తు జారీ బావిలో పడి మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఇంటికి రాకపోవడంతో భావి వద్దకు వెళ్లి వెతకగా భావి వద్ద జారిపోయి పడిన ఆనవాళ్లు కనిపించడంతో బావిలో వెతికారు. లింగం శవం బావిలో బయటపడింది.
వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు లింగం మృతి చెందినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సదాశివ నగర్ పోలీసులు తెలిపారు. రైతు లింగం మృతి చెందడంతో సదాశివ నగర్ లో విషాద ఛాయలు అ లుముకున్నాయి.






