13 August, 2026 | 2:45 AM

ఆల పురుషోత్తంకు కీలక పదవి

13-08-2026 12:00 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకం

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆల పురుషోత్తం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం, సీనియర్ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ప్రధాని మోదీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె. లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గండమల్ల ఆనంద్ గౌడ్, గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు టి. ఉమా మహేందర్ తదితర సీనియర్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గోల్కొండ జిల్లా, గోషామహల్ నియోజకవర్గం నుంచి తనకు ఈ బాధ్యత దక్కడం మరింత బాధ్యతను పెంచిందన్నారు.