‘బిచ్చగాడు’ కాంబోలో వంద దేవుళ్లు
22-03-2026 12:00 AM
మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం ఎన్ని రికార్డులను నెలకొల్పిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ కాంబోలో ‘వంద దేవుళ్లు’ అనే చిత్రం రాబోతోంది. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజి నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ ఆంటోని, స్వాసిక, అజ య్, కావ్య, శక్తి, పదిని తదితరులు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ విష్ణు మంచు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.




