21 May, 2026 | 4:32 AM

పాకిస్థాన్‌కు ఘోర పరాభవం

21-05-2026 01:00 AM

బంగ్లా చేతిలో వైట్‌వాష్

రెండో టెస్టులోనూ పాక్ చిత్తు

సిలెట్, మే 20: టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టుకు ఘోరపరాభవం ఎదురైంది. తొలిసారి బంగ్లాదేశ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన పాక్ తాజాగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. సిలెట్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 78 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.

తద్వారా రెండు టెస్టుల సిరీస్‌ను 2 క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 278 పరుగులకు ఆలౌటైంది. లిటన్‌దాస్ సెంచరీతో మెరిసాడు. తర్వాత పాక్ తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. బాబర్ అజాం ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాడగా మిగిలిన బ్యాట ర్లు విఫలమయ్యారు.

దీంతో పాక్ 232 పరుగులకే ఆలౌటైంది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా భారీస్కోరు చేసింది. ముఫ్పికర్ రహీం సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటై పాక్ ముం దు 437 రన్స్ టార్గెట్‌ను ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 358 పరుగులకు ఆలౌటైంది.

రిజ్వాన్(71), సల్మా న్ అఘా (71) పోరాడినప్పటకీ ఫలితం లేకపోయింది. తైజుల్ ఇస్లాం 6 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. ఈ గెలుపు పాక్‌పై బంగ్లాదేశ్‌కు వరుసగా నాలుగోది. అంతకుముందు రెండు టెస్టులను బంగ్లా పాక్ గడ్డపై గెలిచింది. ఈ ఏడాది మార్చిఇలో పాక్‌ను వన్డే సిరీస్‌లోనూ ఓడించింది. ఇదిలా ఉంటే పాక్‌పై సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో డ బ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో బంగ్లా ఐదో ప్లేస్‌కు చేరుకుంది. ఈ క్రమంలో భారత్‌ను సైతం ఆరో ప్లేస్‌కు నెట్టింది. అటు పాక్ జట్టు తాజా ఓటమితో ఎనిమిదో స్థానానికి పడిపోయింది.