22 June, 2026 | 3:35 AM

ప్రభుత్వ ఉద్యోగం.. సమాజ సేవకు లభించే గొప్ప అవకాశం

22-06-2026 12:18 AM

సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కడ్తల్, జూన్ 21(విజయక్రాం తి):   ప్రభుత్వ ఉద్యోగం సమాజ సేవకు  లభించే గొప్ప గుర్తింపు అని టాస్క్ సి ఓ ఓ, ఐక్యత పౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కడ్తల్ మండలం కర్కల్ పహాడ్లో 65 రోజుల ఉచిత పోలీస్ శిక్షణ ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగం కేవలం ఉపాధి కాదని,కుటుంబానికి భరోసానిస్తూ సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు.

యువత క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన చదువు, శారీరక దృఢత్వంతో లక్ష్యం వైపు సాగాలని, అపజయాలకు నిరుత్సాహపడకూడదని పిలుపునిచ్చారు.ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగి’ లక్ష్యంతో కల్వకుర్తి నియోజకవర్గ యువత కోసం త్వరలో ‘స్కిల్ ఫ్యాక్టరీ‘ ద్వారా ఏఐ , ఐటీ , భాషా నైపుణ్యాల్లో ఉచిత శిక్షణ ఇస్తామన్నారు.ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందించి, తమలో ఆత్మవిశ్వాసం నింపినందుకు విద్యార్థులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.