22 June, 2026 | 2:03 AM

‘నీట్’ కేంద్రం పరిశీలన

22-06-2026 12:17 AM

మేడ్చల్, జూన్ 21(విజయ క్రాంతి): కూకట్పల్లి  జేఎన్టీయూ కాలేజీ లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష కేంద్రాన్ని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి  పరిశీలించారు. కాలేజీలో వివిధ విభాగాలలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షను కలెక్టర్ పరిశీలించారు. పరీక్ష నిర్వహణను సీసీ కెమెరాల ద్వా రా  పర్యవేక్షించారు. జేఎన్టీయూలోని వివిధ విభాగాలలో నిర్వహిస్తున్న నీట్ పరీక్ష సెంటర్లను  తనిఖీ చేశారు. పరీక్ష నిర్వాహణలో ఏ మైనా సమస్యలు ఉన్నాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకు న్నారు.