22 June, 2026 | 4:44 AM

కనకమామిడి ‘కల’ సాకారం

22-06-2026 12:20 AM

15 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన సర్పంచ్ శ్రీదివ్య

మొయినాబాద్, జూన్ 21 (విజయక్రాం తి): మొయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామం ప్రగతి పథం వైపు అడుగు లు వేస్తోంది. గత దశాబ్దన్నర కాలంగా (15 ఏళ్లుగా) పరిష్కారానికి నోచుకోక, పెండింగ్లోనే ఉండిపోయిన గ్రామీణ సమస్యలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. చేవెళ్ల ఎమ్మె ల్యే కాలే యాదయ్య అందిస్తున్న ప్రత్యేక స హకారంతో.. గ్రామ సర్పంచ్ అంతిరెడ్డి శ్రీ దివ్య మురళీధర్ రెడ్డి ఆదివారం పలు కీలక అభివృద్ధి పనులకు ఘనంగా శ్రీకారం చు ట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీదివ్య మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలోని దీర్ఘకాలిక సమస్యలపై తాము ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గ్రామంలో అంతర్గత రహదారులు (సీసీ రోడ్లు), అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించడమే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. కేవలం పనులు చేయడమే కాకుండా, కనకమామిడి గ్రామాన్ని మండలంలోనే నంబర్ వన్ ‘ఆదర్శ గ్రామంగా’ తీర్చిదిద్దుతామని సర్పంచ్ ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నో ఏళ్లుగా మా గ్రామాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కాలే యాదయ్య గారి ఆశీస్సులు, సర్పంచ్ శ్రీదివ్య గారి చొరవతో కనకమామిడి రూపురేఖలు మారి పోతున్నాయి‘ అని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవంలో గ్రామ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు గ్రామస్థులు రికార్డు స్థాయిలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.