17 July, 2026 | 1:13 AM

ఐటీ కారిడార్‌కు మహర్దశ

17-07-2026 12:00 AM

కార్పొరేట్ లుక్‌తో ‘హైటెక్ సిటీ’ రైల్వేస్టేషన్ సిద్ధం

అమృత్ భారత్’ పథకం కింద రూ.26 కోట్ల వ్యయంతో అద్భుత పునర్నిర్మాణం  

నేడు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న ప్రధాని 

ఐటీ ఉద్యోగులు, ప్రయాణికులకు ప్రపంచస్థాయి వసతులు 

రంగారెడ్డి /శేరిలింగంపల్లి, జూలై 16 (విజయక్రాంతి): హైదరాబాద్ పశ్చిమ కారిడా ర్ ఐటీ ఉద్యోగులు, నిత్య ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందించేందుకు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ (అబ్స్ ) కింద రూ.26 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు.

పునర్నిర్మించిన ఈ స్టేషన్ను నేడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా,సీఎం ఎ. రేవంత్ రెడ్డి, కేం ద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.2వేల కో ట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేస్తున్న 40 స్టేషన్లలో హైటెక్ సిటీ స్టేషన్ అత్యంత కీలకమైనదిగా నిలిచింది.  

ఐటీ కారిడార్కు గుండెకాయ వంటి స్టేషన్..

లింగంపల్లిసికింద్రాబాద్ సబర్బన్ ( ఎం ఎంటీఎస్ ) మార్గంలో అత్యంత రద్దీగా ఉం డే ఈ స్టేషన్, ఐటీ హబ్లకు ప్రవేశద్వారం వంటిది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూ ర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లోని కార్యాలయాలకు వెళ్లే వేలాది మంది ఐటీ ఉద్యో గులు ప్రతిరోజూ ఇక్కడి నుంచే ప్రయాణిస్తు ంటారు. ప్రస్తుతం ఈ స్టేషన్ మీదుగా సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), ఉమ్దాన గర్, ఫలక్నుమా, మేడ్చల్, ఘట్కేసర్ రూట్ల లో ప్రతిరోజూ సుమారు 62 ఎంఎంటీఎస్ సేవలు నడుస్తున్నాయి. నిత్యం వేలాది మం ది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు.  

ల్యాండ్స్కేప్స్ నుండి లాంజ్ల వరకు.. సరికొత్త హంగులు ఇవే.....

ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, దశలవారీగా ఈ ఆధునికీకరణ ప నులను పూర్తి చేశారు. స్టేషన్లో గ్రాండ్ ఎం ట్రన్స్ ను కార్పొరేట్ లుక్తో, ఆకర్షణీయమైన కొత్త డిజైన్ పోర్టికోతో తీర్చిదిద్దారు.  విశాలమైన సర్క్యులేటింగ్,స్టేషన్ వెలుపల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విశాలమైన మార్గా లు, పచ్చటి ల్యాండ్స్కేపింగ్ ఏర్పాటు చేశారు.   ప్లాట్ఫారమ్ల మధ్య రాకపోకల కోసం ఉన్న పాత వంతెనతో పాటు, అదనంగా 12 మీట ర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించారు.  

లిఫ్టులు & ఎస్కలేటర్లు: 

వృద్ధులు, రోగుల సౌకర్యార్థం ఇప్పటికే ఉన్న రెండు లిఫ్టులకు తోడుగా అదనంగా మరో ౨ కొత్త లిఫ్టులు, రెండు ఎస్కలేటర్లను ప్రవేశపెట్టారు.  ఆధునిక వెయిటింగ్ హాళ్లు, ఏసీ వెయింటింగ్ లాంజ్, అధునాతన శౌచాలయాలు అందుబాటులోకి వచ్చాయి.  

డిజిటల్ సమాచారం:

స్టేషన్లో సులభంగా దిశలను కనుగొనేందుకు ఎల్‌ఈడీ సైన్బోర్డులు, అత్యాధునిక డిస్ప్లే సిస్టమ్స్ అమర్చారు.  దివ్యాంగులకు 100% స్నేహపూర్వకం (దివ్యంగజన్ ఫ్రెండ్లీ )దివ్యాంగులు ఎవరి సహాయం లేకుండా స్వతంత్రంగా ప్రయాణించేలా స్టేషన్ను డిజైన్ చేశారు. వీల్చైర్ల కోసం ప్రత్యేక ర్యాంపులు, అంధుల కోసం ప్రత్యేక బ్రెయిలీ సంకేతాలు (బ్రెయిల్లే సిగ్నజ్ ), దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేక మరుగుదొడ్లను స్టేషన్ ప్రాంగణంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు.అలాగే ప్రవేశం (ఎంట్రీ ), నిష్క్రమణ (ఎగ్జిట్ ) మార్గాలను వేర్వేరుగా విభజించడం వల్ల రద్దీ సమయంలో కూడా ప్రయాణికులు సురక్షితంగా, వేగంగా రాకపోకలు సాగించవచ్చు.  

నేటి నుంచే సరికొత్త ప్రయాణం..

ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలను తగ్గించి, పర్యావరణ అనుకూల ప్రజారవాణాను ప్రోత్సహించడంలో ఈ స్టేషన్ కీలక పాత్ర పోషించనుంది. జూలై 17న(నేడు) ప్రధాని మోదీ ప్రారంభించిన అనంతరం, ప్రయాణికులకు ఈ కొత్త సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. సరికొత్త హంగులు అద్దుకున్న హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నగర మకుటంలో మరో మణిహారంగా నిలవనుంది.