17 July, 2026 | 1:00 AM

ఘట్‌కేసర్‌లో యాదవ సంఘం నిరసన ర్యాలీ

17-07-2026 12:00 AM

ఘట్ కేసర్, జూలై 16 (విజయక్రాంతి) : యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ పై రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కడి శివ చరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ  ఘట్కేసర్ పట్టణంలో  ఘట్కేసర్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా యాదవ్ సంఘం నాయకులు మాట్లాడుతూ యాదవ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని జెక్కడి శివచరణ్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు అన్ని వర్గాల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలని, ఏ సమాజానికైనా చెందిన వ్యక్తులను అవమానించేలా లేదా వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు.

యాదవ సమాజ గౌరవాన్ని పరిరక్షించేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ, యాదవ సమాజం ఐక్యంగా ఉండి బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.