5 June, 2026 | 2:39 AM

కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో సముచిత స్థానం

05-06-2026 12:10 AM
  1. కల్వకుంట్ల కవిత
  2. టీఆర్‌ఎస్ పార్టీలోకి 20 మంది నాయకులు, కార్యకర్తల చేరిక

మొయినాబాద్, జూన్ 4 (విజయ క్రాం తి): తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ ప్రభు త్వం ఏర్పడుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం మొయినాబాద్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లి, సజ్జన్పల్లి గ్రామాలకు చెందిన సుమారు 20 మంది కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కుమ్మరి శివశంకర్, చేవెళ్ల నియోజకవర్గ నాయకుడు బేగరి రాజు, మొయినాబాద్ మున్సిపాలిటీ ఇన్చార్జ్ ఎండీ అన్వార్ ఖాన్, మండల ఇన్చార్జ్ మేకగూడెం బిక్షపతి సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పార్టీ ముందుకు సాగుతోందన్నారు.

టీఆర్‌ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి అవకాశాలు, వ్యవసాయాభివృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాలతో కూడిన తెలంగాణ రక్షణ సేన సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో షేక్ మహ్మద్ నూర్ భాయ్, కావలి శ్రీను ముదిరాజ్, బొక్క సురేందర్ రెడ్డి, ఎండీ యూనిస్, బొక్క రవీందర్ రెడ్డి, గాండ్ల సంతోష్ కుమార్, సంగేరి నాగేష్, రాజీరెడ్డి, అమరేందర్ యాదవ్, గోపాల్, కత్తుల నరేందర్, పట్లోళ్ల శ్యాంరావు, వడ్డే రాజు, చాంద్ పాషా, కుమ్మరి పవన్ కుమార్, శ్రీకాంత్, శివ, అభిలేష్ తదితరులు పాల్గొన్నారు.