14 July, 2026 | 11:13 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

30-12-2025 01:34 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, డిసెంబర్ 29(విజయక్రాంతి) :అక్రమ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్ బి, ఇంజనీరింగ్, పోలీస్, ఫారెస్ట్, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ అధికారులు తప్పనిసరిగా ఇసుక కొనుగోలు నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వ నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకను సాండ్ బజార్లో నిలవ చేస్తామన్నారు.

ఇప్పటికే నర్సాపూర్లో సాండ్ బజార్ ప్రారంభించడం జరిగిందని, మెదక్ లో తొందరలో ప్రారంభించనున్నామని తెలిపారు. అక్రమ ఇసుక రవాణా చేసే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇల్లీగల్ మైనింగ్ ఎక్కడ జరగకూడదని, మైనింగ్ జరుగుతున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంటే తెలిపితే చట్టాలకు అనుగుణంగా తక్షణం కఠిన చర్యలు తీసుకోవడం జరుగు తుందన్నారు. అక్రమ ఇసుక మైనింగ్ ఏరియాలలో సీసీటీవీ కెమెరాల ద్వారా పటిష్ట పర్యవేక్షణ చేపడుతున్నట్లు వివరించారు. వాటిని ఆధారాలుగా చేసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు. ఫారెస్ట్ ల్యాండ్ నుంచి ఇసుక రవాణా జరుగుతుందని సమాచారం ఉందన్నారు.

ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తనిఖీలు నిర్వహించి అటువంటి వారికి చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేయాలన్నారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగిందని ఆ ప్రాంతాలలో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్‌ఓ భుజంగరావు, ఆర్డిఓ రమాదేవి, నర్సాపూర్ ఆర్డిఓ మహిపాల్ రెడ్డి, డిఆర్డీఓ శ్రీనివాసరావు,ఈడి మైన్స్ సంజయ్ కుమార్, డీఎస్సీ ప్రసన్నకుమార్, ఆర్‌ఐ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.