క్యాన్సర్‌ను నయం చేసే చికిత్స ప్రస్తుతం అవసరం : నారా బ్రాహ్మణి
బంజారాహిల్స్, ఆగస్టు 1(విజయక్రాంతి): ప్రస్తుత తరుణంలో క్యాన్సర్ ను క చ్చితంగా నయం చేసే చికిత్స ఎంతో అవసరమని బసవతారకం ఇండో అమెరికన్ క్యా న్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ట్రస్టు బోర్డు సభ్యురాలు నారా బ్రాహ్మణి అన్నారు. హాస్పిటల్ సహకారంతో సొసైటీ ఆఫ్ జెనిటోయూరినరీ అంకాలజిస్ట్స్ ఐదో వార్షికోత్సవాన్ని శనివారం ప్రారంభించింది. నేడు కూడా జరగనున్న ఈ వార్షికోత్సవాని కి నారా బ్రాహ్మణి ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు.
ప్రెసిషన్ అంకాలజీ ఇన్ యాక్షన్ అనే అంశంతో జరుగుతున్న ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ ప్రతి క్యాన్సర్ బాధితుడికి వారి శరీర తత్వానికి తగినట్లుగా చికిత్సను రూపొందించగల గాలన్నారు. జియోమిక్స్, మాలిక్యులర్ డయాగ్న స్టిక్స్,ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్, టార్గెటెడ్ థెరపీ లాంటి విషయాలను సమ్మిళితం చే యాలని అభిప్రాయపడ్డారు. వ్యక్తికి తగిన చికిత్సను అందించడం అంటే వారి మానవత్వం ప్రదర్శించడమేనని స్పష్టం చేశారు.
బసవతారకం హాస్పిటల్ డాక్టర్ రాకేశ్ శర్మ ఆధ్వర్యంలోని యూరో అంకాలజీ కచ్చితమైన క్యాన్సర్ చికిత్సను అందించడంలో ముందు ఉండడం తమకు గర్వకారణమని తెలిపారు.తమ సంస్థ నిర్వహించిన పరిశోధన,నూతన ఆవిష్కరణలను ఇతరులతో పంచుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటామని ప్రకటించారు.సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ ఆంకాలజిస్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజయ్ అడ్డాల మాట్లాడుతూ యూరో-ఆంకాలజీ రంగంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పంచుకోవడం, బహుళ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం,ఆధారపూర్వక వైద్య విధానాల అమలును వేగవంతం చేయడంలో తమ సంస్థ కీలక వేదికగా నిలుస్తోందన్నారు.
సైంటిఫిక్ చైర్మన్ డాక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్,అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ క్యాన్సర్ సంస్థల మధ్య భాగస్వామ్యం విద్యా,పరిశోధనా రంగాల్లో ఉత్తమతను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సలో జరుగుతున్న పురోగతిని దేశవ్యాప్తంగా రోగులకు మెరుగైన వైద్య సేవల రూపంలో అందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ సదస్సులో ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెసర్ నోయెల్ క్లార్క్, ప్రొఫెసర్ మనీష్ కోహ్లీ, డాక్టర్ జాన్ క్రిస్టోడౌలియాస్, డాక్టర్ యాన్ షక్మన్, డాక్టర్ అలెజాండ్రో బెర్లిన్ వంటి ప్రముఖ నిపుణులు, భారతదేశంలోని ప్రముఖ యూరో-ఆంకాలజీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.






