2 August, 2026 | 3:28 AM

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

02-08-2026 12:32 AM

బోరబండ సీఐ బి.రవికుమార్

జూబ్లీహిల్స్,ఆగస్టు 1(విజయక్రాంతి): స మాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని బోరబండ సీఐ బి.రవికుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసు స్టేషన్ ప రిధిలోని 20 మంది రౌడీ షీటర్లకు కౌన్సిలిం గ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో భాగస్వాములు కావొద్దని హెచ్చరించారు. ఎ టువంటి అల్లర్లను చేయకుండా మంచి ప్రవర్తనతో ఉండాలన్నారు.అసాంఘీక కార్యకలా పాలకు పాల్పడితే చట్టపరంగా కఠినమైన చర్యలు తప్పవని కుండబద్ధలుగొట్టారు. స మాజంలో సోదరభావం,సౌభ్రాతృత్వం, ప్ర జల భద్రత, సామరస్యం పెంపొందేలా వ్యవహరించాలని సూచించారు.ప్రశాంతమైన క్ర మశిక్షణతో కూడిన జీవితాన్ని అలవరచుకోవడానికి తగిన సహాయసహకారాలు పోలీ సు శాఖ అందిస్తుందని తెలిపారు.