ఒకటో తేదీనే జీతాలు
02-08-2026 12:34 AM
- డీఎస్సీ 2008 కాంట్రాక్ట్ టీచర్ల హర్షం
- ముఖ్యమంత్రికి అసోసియేషన్ అధ్యక్షుడి కృతజ్ఞతలు
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో పా టు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చె ల్లించే విధానం అమలవుతున్న నేపథ్యం లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీఎస్సీ2008 కాంట్రా క్ట్ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
సిఎం ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 1వ తేదీన డీఎస్సీ-2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ య్యాయని డీఎస్సీ-2008 కాంట్రాక్ట్ టీచ ర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమంపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం అభినందనీయమని సంతో షం వ్యక్తంచేశారు.






