ఉపాధ్యాయుని నియమించి.. జీతం చెల్లించి..
ఉదారాతను చాటుకున్న వైస్ చైర్మన్
మొయినాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): హిమాయత్నగర్ జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు కోసం మొయినాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ గరుగు రాజు అభినందనీయమైన నిర్ణయం తీసుకున్నారు. గత ఆరు నెలలుగా పాఠశాలలో గణితం టీచర్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.ఈవిషయాన్ని గమనించిన గరుగు రాజు, జీ ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకంగా మహేందర్ అనే ప్రైవేట్ టీచర్ను నియమించారు.
సదరు టీచర్కు తన సొంత డబ్బులతో జీతాన్ని అందజేసి, విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూశారు.విద్యార్థులే దేశ భవిష్యత్తుకు దిక్సూచి.. వారి ఎదుగుదలకు నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అని ఆయన ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, హెచ్‌ఎం జులేక సుల్తానా, ఉపాధ్యాయులు మరియు ఎస్‌ఎంసి సభ్యులు పాల్గొన్నారు.




