6 July, 2026 | 9:23 PM

Breaking News

ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •  

చిన్న ఆత్మకూరులో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలి

05-02-2026 04:26 PM

ఆర్‌డీఓకు వినతిపత్రం మాజీ జెడ్పిటిసి

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ చిన్నఆత్మకూరు గ్రామంలో పౌర సరఫరా (రేషన్) దుకాణం ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరారు.గ్రామస్తుల మేరకు గురువారం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) పార్థసింహారెడ్డికి వినతిపత్రం గ్రామ సర్పంచ్ అనిత లచ్చయ్య మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డిలు సమర్పించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అనిత లచ్చయ్య,మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ...చిన్న ఆత్మకూరు గ్రామంలో రేషన్ దుకాణం లేకపోవడంతో గ్రామ ప్రజలు నిత్యావసర సరుకుల కోసం వేరే గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.దీనివల్ల వృద్ధులు, మహిళలు,పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చిన్నఆత్మకూరు గ్రామంలో వెంటనే పౌర సరఫరా దుకాణం ఏర్పాటు చేయాలని ఆర్‌డీఓను కోరారు.దీనిపై స్పందించిన ఆర్‌డీఓ పార్థసింహారెడ్డి సానుకూలంగా స్పందించి,త్వరలోనే రేషన్ దుకాణం ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిత లచ్చయ్య మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్రెడ్డి ఉన్నారు.